![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -246 లో.....పంతులు సూపర్ మార్కెట్ లో నెయ్యి ప్యాకెట్ మర్చిపోయాడని డీటేల్స్ ఆధారంగా ఫోన్ చేస్తుంది. దాంతో అతను అడ్రెస్ చెప్పగానే గంగ, రంగా ఇద్దరు వెళ్లి నెయ్యి ప్యాకెట్ పట్టుకొని వెళ్తారు .హోమం చేస్తున్న సుధాని విశ్వ చూస్తాడు . వద్దనుకొని వదిలేసి వచ్చిన కూతురు కోసం హోమం చేస్తున్నావా.. మళ్ళీ తిరిగి రాదని విశ్వ అనుకుంటాడు . అప్పుడే గంగ, రంగా ఇంటికి వస్తారు. గంగని చూసి విశ్వ షాక్ అవుతాడు. ఎందుకు వచ్చావని అడుగుతాడు.
గంగని చూసి సుధా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పంతులు నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారు తీసుకొని వచ్చానని గంగ అంటుంది. అంటే నువ్వు బాక్సింగ్ లో సక్సెస్ కాకున్నా సరే తర్వాత ఎలాగోలా సేల్స్ గర్ల్ లాగా అయినా బ్రతకొచ్చని, నీ భర్త డెలివరీ జాబ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడా అని విశ్వ అంటాడు. సర్ మర్యాదగా మాట్లాడండి.. ఎందుకు ఆడది అంటే అంత చిన్నచూపు.. మీరు ఒక ఆడదానికి పుట్టారు.. మీరు పెళ్లి చేసుకుంది కూడా ఒక ఆడదే. మీకు కూతురు ఉంటే ఆడపిల్ల అని వదిలించుకుంటారా అని గంగ అంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావని విశ్వ తనపై అరుస్తాడు. తర్వాత గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రమీలని తీసుకొని రుద్ర సూపర్ మార్కెట్ కి వస్తాడు. రంగాకి రుద్ర ఫోన్ చేసి.. ఎక్కడున్నారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని అంటాడు. రంగా జరిగింది చెప్తుంటే గంగ ఆపుతుంది. ఆ తర్వాత ప్రమీల కోసం కార్తీక్ గాజులు తీసుకొని వస్తాడు. అవి తనకి ఇస్తాడు కార్తీక్. ప్లీజ్ మేడం కోప్పడకండి అని అంటాడు. ప్రమీల కోపంగా వెళ్తుంది.
మరొకవైపు పెద్దసారు దగ్గరికి ఇన్ స్పెక్టర్ వస్తాడు. మిమ్మల్ని షూట్ చేసినప్పుడు కేసు ఫైల్ చేశామని దాని గురించి క్లూ దొరికిందని ఇన్స్పెక్టర్ అంటాడు. నేనేం చెప్పలేదని పెద్దసారు అంటాడు. నేనే చెప్పానని రుద్ర అంటాడు. దాంతో వీరు టెన్షన్ పడతాడు. రెండు విషయాలు అనుమానంగా ఉన్నాయి సర్.. ఒకటి మీ చెల్లి ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడు గొడవ అయింది. వాళ్ళు ఎవరైనా ఎటాక్ చెయ్యొచ్చు. ఇంకొకటి మీ దగ్గర పని చేసిన నాగభూషణం కొడుకు అయి ఉండొచ్చని ఇన్ స్పెక్టర్ అనగానే వీరుకు చెమటలు పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |